- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
49 వార్డుల సమస్యల పరిష్కారం కోరిన బీజేపీ కౌన్సిలర్లు
కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 49 వార్డుల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బీజేపీ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు.

దిశ, కామారెడ్డి టౌన్ : కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 49 వార్డుల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బీజేపీ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. అలాగే రేపు జరగనున్న మున్సిపల్ సర్వసభ్య సమావేశం ఎజెండాలోని కొన్ని అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మున్సిపల్ కమిషనర్‌కు డిసెంట్ నోట్ సమర్పించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ, పట్టణంలోని 49 వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, వీధి దీపాలు వంటి ప్రాథమిక సమస్యలు నెలల తరబడి పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆరోపించారు. ప్రజలకు అత్యవసరమైన సమస్యలను పక్కనపెట్టి, ఎజెండాలో అనవసర ఖర్చులకు సంబంధించిన అంశాలను చేర్చడం సరైంది కాదని పేర్కొన్నారు. మున్సిపాలిటీ నిధులను ప్రజల అవసరాలకు అనుగుణంగా వినియోగించాలని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే నిర్ణయాలకు తావు ఇవ్వకూడదని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న మౌలిక సదుపాయాల పనులకు ప్రాధాన్యతనిస్తూ వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు.






