- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
22A నిబంధనలు కఠినతరం.. త్వరలో కొత్త జీవో
22A నిబంధనలను ఏపీ ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. ఈ మేరకు త్వరలో కొత్త జీవోను విడదల చేయనుంది. 22ఏ జాబితాలో చేర్చిన భూములపై మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు...

దిశ, వెబ్ డెస్క్: 22A నిబంధనలను ఏపీ ప్రభుత్వం(Ap Government) మరింత కఠినతరం చేసింది. ఈ మేరకు త్వరలో కొత్త జీవోను విడదల చేయనుంది. 22ఏ జాబితా(List 22A)లో చేర్చిన భూములపై మంత్రి అనగాని సత్యప్రసాద్(Minister Anagani Satya Prasad) ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామకంఠం, పట్టా, అసైన్డ్ భూముల రికార్డుల(Grama Kantham, Patta, assigned Lands Records)ను ప్రక్షాళన చేస్తున్నామని, ఈ మేరకు కలెక్టర్లకు ప్రత్యే ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. 90 రోజుల్లో ప్రక్షాళన పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రికార్డుల ప్రక్షాళనపై ప్రత్యేక యాప్ రూపొందించినట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వ భూముల రక్షణ కోసమే 2007లో 22ఏ తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఇకపై ఐజీ ఆధ్వర్యంలో 22ఏ డేటా బేస్ ఉంటుందన్నారు. వ్యవసాయ భూములకు వెబ్‌ల్యాండ్ 2.0 మాత్రమేనని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.






