- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డేవిడ్ వార్నర్ కు 9 నెలల జైలు శిక్ష!
డేవిడ్ వార్నర్ కు 9 నెలల జైలు శిక్ష పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ చిక్కుల్లో పడ్డారు. అతనికి 9 నెలల పాటు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మొన్న ఎండాకాలం పాకిస్తాన్ సూపర్ లీగ్ జరిగినప్పుడు డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఇరుక్కున్నాడు వార్నర్. అయితే ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నేరాన్ని డేవిడ్ వార్నర్ అంగీకరించాడు.
మద్యం తాగిన తర్వాత క్యాబ్ లో వెళ్లకుండా డ్రైవ్ చేసి తప్పు చేశానని ఆయన ఒప్పుకున్నట్లు డేవిడ్ వార్నర్ తరపు న్యాయవాది కోర్టుకు వివరణ ఇచ్చారు. ఈ తరుణంలో ఆగస్టు 18వ తేదీన డేవిడ్ వార్నర్ కు శిక్ష విధించనుంది కోర్టు. ఆరు నెలల డ్రైవింగ్ నిషేధం, 2200 డాలర్ల ఫైన్ తో పాటుగా 9 నెలల పాటు అతనికి శిక్ష పడే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా ఏప్రిల్ 5వ తేదీన సిడ్నీలో వార్నర్ పై డ్రంకెన్ డ్రైవ్ కేసు నమోదయింది.






