మంత్రి సమీక్షకు పక్కాగా ఏర్పాట్లు

by Taduka Kalyani |

హుస్నాబాద్ ఐఓసీలో గురువారం రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించనున్న వానకాలం ఎల్ నీనో సమీక్ష సమావేశ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కె.హైమావతి బుధవారం పరిశీలించారు.

మంత్రి సమీక్షకు పక్కాగా ఏర్పాట్లు
X

దిశ, హుస్నాబాద్: హుస్నాబాద్ ఐఓసీలో గురువారం రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించనున్న వానకాలం ఎల్ నీనో సమీక్ష సమావేశ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కె.హైమావతి బుధవారం పరిశీలించారు. 3 జిల్లాల కలెక్టర్లు, 7 మండలాల అధికారులు హాజరయ్యే ఈ భేటీకి ప్రొజెక్టర్, సీటింగ్, మైక్ సెట్టింగ్, భోజన సౌకర్యాలు నిరంతరం విద్యుత్ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ రామ్మూర్తిని ఆదేశించారు.

విద్యార్థినుల వసతి గృహం పరిశీలన

అనంతరం హుస్నాబాద్ 20వ వార్డులోని రైతు బజార్ భవనంలో శాతవాహన ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినుల తాత్కాలిక వసతి కోసం కేటాయించిన 1, 2వ అంతస్తులను కలెక్టర్ సందర్శించారు. శాశ్వత భవనం పూర్తయ్యే వరకు ఇక్కడ తాగునీరు, మరుగుదొడ్లు, భోజన వసతులు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రామ్మూర్తి, తహసీల్దార్, కళాశాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story