ప్రజల అవసరాలే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి

by Taduka Kalyani |

అమీన్‌పూర్ ప్రాంతాన్ని సమగ్ర ప్రణాళికతో శరవేగంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజల అవసరాలే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు.

ప్రజల అవసరాలే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి
X

దిశ, అమీన్ పూర్ : అమీన్‌పూర్ ప్రాంతాన్ని సమగ్ర ప్రణాళికతో శరవేగంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజల అవసరాలే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. అమీన్‌పూర్ సర్కిల్-47 పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.16.53 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు బుధవారం టీజీఐఐసీ ఛైర్మెన్ నిర్మలా జగ్గారెడ్డి,స్థానిక ఎమ్మెల్సీ అంజిరెడ్డి తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అభివృద్ధిని వేగవంతం చేస్తోందని తెలిపారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా నిధులు కేటాయించి బీరంగూడతో పాటు అమీన్‌పూర్ ప్రాంత సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సౌకర్యం, వీధి దీపాలు, స్మశానవాటిక అభివృద్ధి వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. అనంతరం పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, గడ్డం వివేక్ వెంకటస్వామి బీరంగూడ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి మరిన్ని నిధులు మంజూరు చేయాలని కోరారు.

బీరంగూడ అభివృద్ధికి రూ.9.03 కోట్ల మంజూరు పై కృతజ్ఞతలు : శశిధర్ రెడ్డి.

అమీన్‌పూర్ సర్కిల్-47 పరిధిలో మంజూరైన రూ.16.53 కోట్ల అభివృద్ధి పనుల్లో భాగంగా బీరంగూడ ప్రాంతానికి రూ.9.03 కోట్ల నిధులు కేటాయించడం పట్ల కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, మంత్రి దామోదర రాజనర్సింహ, పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులతో బీరంగూడను ఆదర్శ డివిజన్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. సహకరించిన మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకట స్వామి,కాటా శ్రీనివాస్ గౌడ్ లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీజీఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి డీసీ ప్రదీప్ కుమార్, పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్‌, మున్సిపల్ అధ్యక్షులు శశిధర్ రెడ్డి తో పాటు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రాహుల్ గాంధీ అరెస్టు నిరసిస్తూ బీరంగూడలో కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన

విద్యార్థులపై పోలీసుల దాడులకు నిరసనగా ఢిల్లీలో ప్రధాని నివాసాన్ని ముట్టడించే కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ బీరంగూడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. బీరంగూడ డివిజన్ పరిధిలోని గుట్ట కమాన్ వద్ద అమీన్పూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ పాల్గొని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్దం చేయడానికి ప్రయత్నించిన కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకొని స్టేషన్ కి తరలించారు.ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Next Story