- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిన్నారులకు దారి కష్టాలు
by Batti.Sumithra |
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని బుట్టాయిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఎస్టీ కాలనీలోని అంగన్‌వాడీ కేంద్రం–1కు వెళ్లేందుకు సరైన దారి లేక చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

X
దిశ, కన్నాయిగూడెం : ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని బుట్టాయిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఎస్టీ కాలనీలోని అంగన్‌వాడీ కేంద్రం–1కు వెళ్లేందుకు సరైన దారి లేక చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా దారి సౌకర్యం లేక చిన్నారులు, వారి తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నట్లు స్థానికులు తెలిపారు. అంగన్‌వాడీకి వెళ్లే దారి మొత్తం బురద, గడ్డితో అధ్వానంగా మారడంతో చిన్నారులను కేంద్రానికి పంపేందుకు తల్లిదండ్రులు వెనుకాడుతున్నారు. ఈ సమస్యను పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లే మార్గాన్ని సరిచేసి, చిన్నారుల దారి కష్టాలను శాశ్వతంగా తొలగించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
Next Story






