దళితుల సబ్ ప్లాన్ నిధులు పక్కదారి: దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు

by Kodari Anjali |

తెలంగాణలో దళితుల సబ్ ప్లాన్ నిధులను కాంగ్రెస్ సర్కార్ దారి మళ్లిస్తుందని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ ఆరోపించారు.

దళితుల సబ్ ప్లాన్ నిధులు పక్కదారి: దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు
X

దిశ, హిమయత్ నగర్: తెలంగాణలో దళితుల సబ్ ప్లాన్ నిధులను కాంగ్రెస్ సర్కార్ దారి మళ్లిస్తుందని దళిత బహుజన పార్టీ (డీబీపీ) జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ ఆరోపించారు. బుధవారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎస్సీ ,ఎస్టీ సామాజిక, ఆర్ధిక, జీవన అభివృద్ధి కోసం ఉద్దేశించి ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆర్ధిక వార్షిక బడ్జెట్ నిధులు సుమారు రూ. 12 వేల కోట్ల నిధులు దారి మళ్లించి దళితుల అభివృద్ధి ని అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఈ ఉప ప్రణాళిక నిధులను వేరే శాఖలకు బదిలీ చేస్తూ దళిత కులాలకు తీవ్రంగా అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల అభివృద్ధి కోసం ఖర్చు చేయవలసిన నిధులను దారి మళ్లీస్తున్న కూడా… దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పందించకుండా సీఎంకి పాలేరుతనం చేయడం అత్యంత దారుణం అని మండిపడ్డారు. ఇప్పటికైనా దళిత ప్రజా ప్రతినిధులు స్పందించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కృష్ణస్వరూప్ హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పి. మోహన్ రావు, తెలంగాణ రాష్ట్ర కో ఆర్డినేటర్ బి. ధర్మరాజు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Next Story