- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా ఐపీఎస్‌పై లైంగిక ఆరోపణల కేసు.. ఆస్పత్రి నుంచి ఉదయ కృష్ణారెడ్డి డిశ్చార్జ్
మహిళా ఐపీఎస్‌పై లైంగిక ఆరోపణల కేసులో కీలక మలుపులు తిరుగుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: మహిళా ఐపీఎస్‌పై లైంగిక ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డి రెండు రోజుల తర్వాత ఇవాళ మధ్యాహ్నం ఎస్ఆర్ నగర్‌లోని జయంతి ఆస్పత్రి నంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ క్రమంలోనే అసలు ఏం జరిగిందని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఆయన సమాధానం చెప్పకుండానే కారు ఎక్కి వెళ్లిపోయారు.
ఇక, ట్రైనీ మహిళా ఐపీఎస్ ఇచ్చిన ఫిర్యాదుతో ఉదయ కృష్ణారెడ్డిపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ క్రమంలోనే తనపై నమోదైన కేసును కొట్టివేయాలని (Quash Petition) కోరుతూ ఉదయ కృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌లో ఉదయ్ కృష్ణారెడ్డి వాదన తనపై మోపబడిన ఆరోపణలన్నీ అబద్ధాలని, కావాలనే తప్పుడు కేసు బనాయించారని ఉదయ్ కృష్ణారెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. చట్టంపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్న ఆయన, తనపై నమోదైన కేసును రద్దు చేయాలని కోరారు. అయితే, ఉదయ్ కృష్ణారెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది.






