దానయ్య కుటుంబానికి అండగా ప్రభుత్వం.. రూ. 10 లక్షల ఆర్థిక సాయం

by Vemula.Srinu Prasad |

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ చేసిన రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే దానయ్య కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది...

దానయ్య కుటుంబానికి అండగా ప్రభుత్వం..  రూ. 10 లక్షల ఆర్థిక సాయం
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ చేసిన రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే దానయ్య కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది. రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని మంత్రి పార్ధసారథి అందజేశారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో దానయ్య కుటుంబాన్ని ఎమ్మెల్యే గౌతు శిరీషతో పాటు ఆయన పరామర్శించారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా అందజేశారు. ప్రభుత్వం తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో చట్టం ఎవరికీ చుట్టంకాదన్నారు. తప్పు చేస్తే ఎంతటివారికైనా శిక్ష తప్పదని హెచ్చరించారు. దానయ్య మృతి కారకులపై ఇప్పటికే కేసు నమోదు అయినట్లు తెలిపారు.

కాగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ కాశీబుగ్గలో బైక్‌తో గొర్రెల కాపరి దానయ్యను ఢీకొట్టారు. ఈ ఘటనలో దానయ్య అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ప్రమాదం నుంచి తప్పించేందుకు మరో వ్యక్తి యాక్సిడెంట్ చేసినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే సీసీ ఫుటేజుల ద్వారా ఆరవ్ యాక్సిడెంట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ఆరవ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే దానయ్య మృతితో బాధిత కుటుంబం మరింత దీనస్థితిలోకి వెళ్లిపోయింది. పిల్లలను భోజనం పెట్టే స్థాయి కూడా లేకపోవడంతో ప్రభుత్వం అండగా నిలిచింది.

Next Story