- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు సత్తుపల్లిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటన
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు గురువారం సత్తుపల్లి సమీపంలోని సింగరేణి జేవీఆర్ ఓపెన్‌కాస్ట్–2 గనులను సందర్శించనున్నారు.

దిశ, సత్తుపల్లి : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు గురువారం (జూలై 23) సత్తుపల్లి సమీపంలోని సింగరేణి జేవీఆర్ ఓపెన్‌కాస్ట్–2 (OC-II) గనులను సందర్శించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జేవీఆర్ ఓపెన్‌కాస్ట్ గనులకు చేరుకోనున్న ఉప ముఖ్యమంత్రి ముందుగా సింగరేణి అధికారులతో సమావేశమవుతారు. అనంతరం మధ్యాహ్నం 12.10 గంటల నుంచి 2.30 గంటల వరకు జేవీఆర్ OC-II గనులను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు.
ఈ సందర్భంగా బొగ్గు ఉత్పత్తి, బొగ్గు నాణ్యత, ఉత్పత్తి పరిమాణం, గనుల నిర్వహణ, భద్రతా ప్రమాణాలు తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. గనుల పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించి అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 3.30 గంటల వరకు రిజర్వ్ సమయం ఉండగా, మధ్యాహ్నం 3.30 గంటలకు సత్తుపల్లి నుంచి రోడ్డు మార్గంలో కొత్తగూడెం బయలుదేరనున్నట్లు జిల్లా సింగరేణి అధికారులు తెలిపారు.






