బోనాల పండుగ ఏర్పాట్లలో నిర్లక్ష్యం వద్దు.. జోనల్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేత

by Kodari Anjali |

రానున్న బోనాల మహోత్సవాలను పురస్కరించుకుని బీఎన్ రెడ్డి నగర్ డివిజన్‌లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కాంగ్రెస్ పార్టీ డివిజన్, నూతన అధ్యక్షుడు జోనల్ కమిషనర్‌కు వినతి పత్రం సమర్పించారు.

బోనాల పండుగ ఏర్పాట్లలో నిర్లక్ష్యం వద్దు..  జోనల్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేత
X

దిశ, హస్తినాపురం: రానున్న బోనాల మహోత్సవాలను పురస్కరించుకుని బీఎన్ రెడ్డి నగర్ డివిజన్‌లో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కాంగ్రెస్ పార్టీ డివిజన్, నూతన అధ్యక్షుడు పి. గణేష్ రెడ్డి బుధవారం, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహతోను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బుధవారం, విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, బోనాల పండుగ సందర్భంగా ఆలయాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున రహదారులు, పారిశుద్ధ్యం, విద్యుత్, తాగునీటి వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. డివిజన్ పరిధిలోని గుంతలతో ఉన్న రహదారులను వెంటనే మరమ్మతు చేయడంతో పాటు, ఆలయాల వద్ద తగిన విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, చెత్తను ఎప్పటికప్పుడు తొలగిస్తూ పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని సూచించారు. అలాగే భక్తుల సౌకర్యార్థం తాగునీరు, మొబైల్ టాయిలెట్లు వంటి సదుపాయాలు అందుబాటులో ఉంచాలని అధికారులను కోరారు. బోనాల ఉత్సవాలు ప్రశాంతంగా, వైభవంగా జరిగేలా జీహెచ్‌ఎంసీతో పాటు అన్ని సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి అవసరమైన చర్యలు చేపట్టాలని పి. గణేష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Next Story