- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహాపూర్ణాహుతితో వరుణ యాగం ముగింపు
by Taduka Kalyani |
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం గుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి జన్మనక్షత్రం స్వాతి సందర్భంగా గిరి ప్రదక్షిణ భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించారు.

X
దిశ, వర్గల్ : సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం గుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి జన్మనక్షత్రం స్వాతి సందర్భంగా గిరి ప్రదక్షిణ భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించారు. రంగంపేట పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామి పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు ఉచిత అల్పాహారం అందించారు. అలాగే దేశంలో సకాలంలో వర్షాలు కురిసి ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని సంకల్పించి మూడు రోజులుగా నిర్వహించిన వరుణ మహాయాగం మహాపూర్ణాహుతితో ముగిసింది. వేదోక్తంగా ఋష్యశృంగుని నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి, ఆలయ ఈఓ రంగా చారి,తదితరులు పాల్గొన్నారు.
Next Story






