ఏపీలో ఎందుకు మాట్లాడటం లేదు: పేపర్ లీకేజీ ఘటనపై కేతిరెడ్డి ఫైర్

by Vemula.Srinu Prasad |

నీట్, డీఎస్సీపేపర్ లీకేజీల వ్యవహారంపై వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి స్పందించారు. అంతేకాదు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ..

ఏపీలో ఎందుకు మాట్లాడటం లేదు: పేపర్ లీకేజీ ఘటనపై కేతిరెడ్డి ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: నీట్(Neet), డీఎస్సీ(Dsc) పేపర్ లీకేజీల వ్యవహారంపై వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి(YCP leader Kethireddy Venkatrami Reddy) స్పందించారు. అంతేకాదు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశమంతటా నీట్ పేపర్ లీకేజీపై పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు వ్యక్తమవుతున్నా రాష్ట్రంలో మాత్రం అలాంటి స్పందన కనిపించకపోవడం ఆశ్చర్యంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. సినిమా బెనిఫిట్ షో(Movie benefit show)ల విషయంలో ప్రజలు, యువత చూపే ఆసక్తి, ఉత్సాహం నిరుద్యోగులు, విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్, డీఎస్సీ వంటి ఘటనలపై ఎందుకు కనిపించడం లేదని కేతిరెడ్డి ప్రశ్నించారు.

విద్యావ్యవస్థలోని లోపాలు, ప్రశ్నాపత్రాల లీకేజీల వల్ల వేలాది మంది అభ్యర్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్నా స్పందించకపోవడం సరికాదని కేతిరెడ్డి మండిపడ్డారు. బాధ్యత తీసుకుని ప్రశ్నించాల్సిన వర్గాలే మౌనంగా ఉంటే ఇక ఇతరులు ముందుకు వచ్చి ఎలా ప్రశ్నిస్తారని ఆయన నిలదీశారు. సమాజంలో ప్రాధాన్యత ఉన్న విషయాలపై మౌనం వీడాలని సూచించారు. విద్యార్థులు, నిరుద్యోగుల హక్కుల కోసం కేక వేయాల్సిన అవసరం ఉందని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు.

Next Story