11 గంటల తర్వాతే అధికారులు.. నిరీక్షణలో ప్రజలు

by Ratna Kumari |

నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయం, జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయాల్లో అధికారుల సమయపాలనపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

11 గంటల తర్వాతే అధికారులు.. నిరీక్షణలో ప్రజలు
X

దిశ, నల్లగొండ టౌన్ : నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయం, జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయాల్లో అధికారుల సమయపాలనపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 11 గంటల తర్వాతే అధికారులు కార్యాలయాలకు వస్తున్నారని, దీంతో వివిధ పనుల కోసం వచ్చిన ప్రజలు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు.

మారుమూల గ్రామాల నుంచి సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాలకు వచ్చే ప్రజలు అధికారుల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంటోందని, దీనివల్ల వారి పనులు ఆలస్యమవుతున్నాయని చెబుతున్నారు. సమయానికి అధికారులు అందుబాటులో లేకపోవడంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు నిర్ణీత సమయానికి పనిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందేలా సంబంధిత సిబ్బంది సమయపాలన పాటించేలా జిల్లా ఉన్నతాధికారులు పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story