తెల్ల డ్రెస్‌లో మల్లెపూలతో మెరిసిన ఎస్తర్ అనిల్.. కుర్రకారును ఫిదా చేసిన అందాలు

by Pulgam srinivas |

తెల్ల డ్రెస్‌లో మల్లెపూలతో మైమరపిస్తున్న ఎస్తర్ అనిల్.

తెల్ల డ్రెస్‌లో మల్లెపూలతో మెరిసిన ఎస్తర్ అనిల్.. కుర్రకారును ఫిదా చేసిన అందాలు
X

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ నటి ఎస్తర్ అనిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దృశ్యం సిరీస్‌తో ఈ ముద్దుగుమ్మ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.




సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోనూ అదే స్థాయిలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటుంది. స్టైలిష్ ఫోటోషూట్లతో నెటిజన్లను ఆకట్టుకుంటూ, వాటిని తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తుంటుంది.




ఆమె పోస్ట్ చేసే ఫోటోలకు అభిమానుల నుంచి భారీ స్పందన లభిస్తూ, తరచూ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఎస్తర్ అనిల్ మరోసారి తన లేటెస్ట్ ఫోటోషూట్‌తో సోషల్ మీడియాలో సందడి చేసింది.




వైట్ స్లీవ్‌లెస్ డ్రెస్‌లో మెరిసిపోతూ, నుదుటిపై చిన్న బొట్టు, చెవులకు స్టైలిష్ ఇయర్‌రింగ్స్ ధరించి ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. అందంగా జడ వేసుకుని దానికి మల్లెపూలు అలంకరించుకోవడంతో ఆమె లుక్‌కు మరింత క్లాసిక్ టచ్ వచ్చింది.




క్లాస్‌తో పాటు గ్లామర్‌ను అద్భుతంగా మేళవిస్తూ ఎస్తర్ ఇచ్చిన స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలకి పెద్ద ఎత్తున లైక్స్ వస్తున్నాయి.

Photos Courtesy: Instagram

Next Story