రాజోలి మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం

by Batti.Sumithra |

రాజోలి మండలంలోని అన్ని గ్రామాల బీఎల్ఏలకు (BLA) ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR)పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

రాజోలి మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
X

దిశ, రాజోలి : రాజోలి మండలంలోని అన్ని గ్రామాల బీఎల్ఏలకు (BLA) ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR)పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. AICC కార్యదర్శి, అల్లంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్.ఏ. సంపత్ కుమార్ ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పులిపాటి దస్తగిరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అల్లంపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పచర్ల కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బూత్ పరిధిలోని ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి కొత్త ఓటర్ల నమోదు, పేర్ల సవరణలు, చిరునామా మార్పులు, మరణించిన వారి పేర్ల తొలగింపు పై ప్రత్యేక దృష్టి సారించాలని బీఎల్ఏలకు సూచించారు. అలాగే, ఇంటింటికీ వెళ్లి అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరు జాబితాలో నమోదు చేయించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, బీఎల్ఏలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story