- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలి
తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో తిరుమలగిరిలోని పూలే–అంబేడ్కర్ తెలంగాణ చౌరస్తాలో సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.

దిశ, తిరుమలగిరి : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో తిరుమలగిరిలోని పూలే–అంబేడ్కర్ తెలంగాణ చౌరస్తాలో సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు మాట్లాడుతూ.. భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం వల్ల దేశ రైతులకు నష్టం జరుగుతుందని ఆరోపించారు. అమెరికా నుంచి దిగుమతి అయ్యే వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు తగ్గించడం, దేశీయ రైతుల పంటలకు తగిన ప్రోత్సాహం లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం వెంటనే భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసి, రైతాంగానికి మేలు చేసే దీర్ఘకాలిక వ్యవసాయ విధానాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు. అలాగే గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా కొనసాగించి, రైతులు, వ్యవసాయ కూలీల ప్రయోజనాలను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీఎంపీఎస్ జిల్లా అధ్యక్షుడు కడెం లింగయ్య, పీఎన్‌ఎం రాష్ట్ర నాయకుడు బూర్గుల ప్రభాకర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు దేవరకొండ యాదగిరి, కడియం కుమార్, గుడిపూడి వెంకటేశ్వర్లు, పులిమామిడి బిక్షం తదితరులు పాల్గొన్నారు.






