- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాస్‌పోర్టు ఫీజు పెంపు అంశం: కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
పాస్‌పోర్ట్ రుసుముల పెంపు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పాస్‌పోర్టు (Passport) ఫీజులను సవరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రుసుములపై పెంపును సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ నేపథ్యంలోనే ఆ అంశంపై ఇవాళ జస్టిస్ డీకే ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కారియాల ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. పాస్‌పోర్టు ఫీజు పెంపుపై వచ్చిన పిటిషన్‌ను వినతిపత్రంగా పరిగణించి, 3 నెలల వ్యవధిలో తగిన నిర్ణయం తీసుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖకు నోటీసుల జారీ చేసింది.
కేసు నేపథ్యం ఇదే..
కాగా, పాస్‌పోర్ట్ సవరణ నిబంధనలు-2026 కారం జూలై 1 నుంచి పాస్‌పోర్ట్ ఫీజులను ప్రభుత్వం పెంచింది. దానిని సవాలు చేస్తూ ప్రవాసీ లీగల్ సెల్ (Migrant Legal Cell) అనే సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. 36 పేజీల సాధారణ పాస్‌పోర్ట్ రుసుము రూ.1,500 నుంచి రూ.2,500కు పెరిగిందని వారు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. అదేవిధంగా విదేశాల్లో ఉన్న భారతీయులకు రుసుము 75 డాలర్లు భారత కరెన్సీలో రూ.7,165 నుంచి 125 డాలర్లకు సుమారు రూ.11,942కు పెరిగింది. ఈ అదనపు భారం ముఖ్యంగా గల్ఫ్ దేశాలు ఇతర ప్రాంతాల్లో పనిచేసే బ్లూ-కాలర్ కార్మికులు, విదేశీ భారత పౌరులపై తీవ్రంగా పడుతోందని పిటిషనర్ పేర్కొన్నారు. పాస్‌పోర్ట్ అనేది విలాసవంతమైన వస్తువు కాదని, ఉపాధి, వీసా రెన్యూవల్, విదేశీ ప్రయాణాలకు అత్యంత అవసరమైన చట్టబద్ధమైన డాక్యుమెంట్ అని కోర్టుకు విన్నవించారు. అయితే, విదేశాంగ శాఖ ఈ అంశంపై నిర్ణయం తీసుకుని, అనంతరం ఆ నిర్ణయాన్ని పిటిషనర్‌కు తెలియజేయాలని ఆదేశిస్తూ ధర్మాసనం పేర్కొన్నది.






