- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ వెర్సెస్ బీజేపీ.. కర్రలతో కొట్టుకున్న కార్యకర్తలు
by Kodari Anjali |
గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది.

X
దిశ, కార్వాన్: గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్ట్‌ను నిరసిస్తూ ఉదయం నుంచి కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనలకు పోటీగా, బీజేపీ శ్రేణులు గాంధీ భవన్ ముట్టడికి యత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. గాంధీ భవన్ వద్ద రెండు పార్టీల కార్యకర్తలు తలపడి, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగంలోకి దిగి, ఇరువర్గాల కార్యకర్తలపై లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. ఈ ఘర్షణ కవరేజ్ చేస్తున్న క్రమంలో జరిగిన దాడిలో ఓ మీడియా రిపోర్టర్ తలకు తీవ్ర గాయమైంది. బాధితుడిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గాంధీ భవన్, పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు.
Next Story






