రాహుల్ గాంధీ అరెస్టుపై బాల్కొండలో కాంగ్రెస్ ఆగ్రహం

by Ratna Kumari |

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.

రాహుల్ గాంధీ అరెస్టుపై బాల్కొండలో కాంగ్రెస్ ఆగ్రహం
X

దిశ, మోర్తాడ్ : ఏఐసీసీ నేత రాహుల్ గాంధీతో పాటు ప్రతిపక్ష నేతల అరెస్టును ఖండిస్తూ, నీట్ పేపర్ లీకేజీ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో మోర్తాడ్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలని, నీట్ పేపర్ లీకేజీ వంటి ఘటనలతో విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story