- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రేమపేరుతో మోసం.. ముఖం చాటేస్తున్న యువజన నాయకుడు
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలానికి చెందిన ఓ యువతి, వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశారని ఆరోపిస్తూ పర్వతగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

దిశ, పర్వతగిరి : వరంగల్ జిల్లా పర్వతగిరి మండలానికి చెందిన ఓ యువతి, వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశారని ఆరోపిస్తూ పర్వతగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు సమర్పించిన ఫిర్యాదు ప్రకారం, తమ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల యువజన నాయకుడు గత కొంతకాలంగా ప్రేమపేరుతో సన్నిహితంగా ఉంటూ వివాహం చేసుకుంటానని నమ్మించి పలుమార్లు శారీరకంగా వాడుకొని పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడని పేర్కొంది.
ఆ నమ్మకంతో తమ మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడిందని, అనంతరం యువకుడు మాట మార్చి వివాహానికి నిరాకరించడంతో పాటు స్థానిక నేతలు వారి పేర్లు చెబుతూ అవమానకరంగా మాట్లాడి, బెదిరింపులకు కూడా పాల్పడ్డాడని ఆరోపించింది. ఈ విషయమై గ్రామ పెద్దల సమక్షంలో రాజీ ప్రయత్నాలు జరిగినప్పటికీ ఫలితం లేకపోయిందని, తనను అవమానించిన మరికొందరిపైనా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరినట్లు తెలిసింది. ప్రేమపేరుతో నమ్మించి మోసం చేసి, వివాహానికి నిరాకరించడం వల్ల తాను తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని పేర్కొన్న బాధితురాలు, సంబంధిత వ్యక్తుల పై చట్టపరమైన కేసునమోదు చేసి, సమగ్ర దర్యాప్తు నిర్వహించి తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరింది.






