- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముత్యం వెంకటరమణ ఇంట్లో రూ. 15 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ అధికారులు
పునరుత్పాదక ఇంధన సంరక్షణ సౌరశక్తి(తెలంగాణ రెడ్కో) డివిజనల్ ఇంజనీర్ ముత్యం వెంకటరమణ నివాసాల్లో ఏసీబీ సోదాలలో భారీగా భారీగా ఆస్తులు గుర్తించారు.

దిశ, శేరిలింగంపల్లి: పునరుత్పాదక ఇంధన సంరక్షణ సౌరశక్తి(తెలంగాణ రెడ్కో) డివిజనల్ ఇంజనీర్ ముత్యం వెంకటరమణ నివాసాల్లో ఏసీబీ సోదాలలో భారీగా భారీగా ఆస్తులు గుర్తించారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు ముత్యం వెంకటరమణ నివాసంతో పాటు పది ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.మాధాపూర్‌లోని ఆయన నివాసంతో పాటు కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ పర్యవేక్షణలో సోదాలు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడుతూ కమిషన్ల పేరిట కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్లుగా ఆయనపై వచ్చిన ఆరోపణలు ఆధారంగా దాడులు కొనసాగాయి. ఇప్పటివరకు రూ.15 కోట్లకు పైగా విలువైన ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. మాదాపూర్‌లోని ట్రాన్స్‌కో డీఈ ముత్యం వెంకటరమణ నివాసంలో ఇప్పటివరకు నాలుగు ఇళ్లు, సుమారు రూ.1 కోటి విలువైన బంగారు ఆభరణాలు, నాలుగు వాహనాలను అధికారులు గుర్తించారు.
ముత్యం వెంకటరమణ గతంలో..
ముత్యం వెంకటరమణ భార్య పేరుపై నిర్మాణ సంస్థలు ఉన్నాయి . ఎమ్మెస్ ప్రైడ్ సంస్థలలో భారీగా పెట్టుబడులు పెట్టినట్టు గుర్తించారు. ఆయా సంస్థలకు ఆమె డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలు, ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు రూ.15 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఇంకా ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయని ఏసీబీ డీఎస్పీ మజీద్ వెల్లడించారు. కాగా, ముత్యం వెంకటరమణ గతంలో 2019లో ఏసీబీ ట్రాప్ కేసులో కూడా చిక్కుకున్న విషయం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం జరుగుతున్న సోదాలతో మరిన్ని అక్రమ ఆస్తుల వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఏసీబీ అధికారులు గుర్తించిన ఆస్తులు బహిరంగ మార్కెట్లో 80 కోట్ల వరకు ఉంటాయని భావిస్తున్నారు. విదేశీ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకొని ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు.






