- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రాఫిక్ జామ్‌లోనూ ఆగని పని.. బైక్‌పైనే ల్యాప్‌టాప్ తెరిచిన ఉద్యోగి! వైరల్
నగరాల్లో ట్రాఫిక్ కష్టాలు, కార్పొరేట్ ఆఫీసుల్లో వర్క్ ప్రెజర్‌కు అద్దం పట్టే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: నగరాల్లో ట్రాఫిక్ కష్టాలు, కార్పొరేట్ ఆఫీసుల్లో వర్క్ ప్రెజర్‌కు అద్దం పట్టే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కేవలం 5 నిమిషాల పాటు ట్రాఫిక్ జామ్ అవ్వగా.. ఓ వ్యక్తి తన బైక్‌పైనే ల్యాప్‌టాప్ తెరిచి ఆఫీసు పని చేసుకోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో కచ్చితంగా తెలియకపోయినా, ఈ వీడియో నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది.
వైరల్ అవుతున్న పోస్ట్
SaffronChargers అనే యూజర్ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేస్తూ.. ‘8 గంటల ఉద్యోగం తర్వాత ఇంటికి వెళ్లే దారిలో కూడా అతను పనిచేయాల్సి వస్తోంది. బహుశా ఇంటికి వెళ్లాక కూడా పని కొనసాగిస్తాడేమో. భారతదేశంలో మనుషులు నెమ్మదిగా యంత్రాలుగా మారుతున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వీడియోకు లక్షలకు పైగా వ్యూస్, వేల సంఖ్యలో లైక్స్ వస్తున్నాయి.
నెటిజన్ల భిన్న స్పందనలు..
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ ఉద్యోగి వర్క్ ప్రెజర్ పై జాలి చూపిస్తూనే, భిన్న రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. టెక్నాలజీ అవకాశాలను సృష్టించినా.. వ్యక్తిగత సమయాన్ని లాగేసుకుందని ఒకరు కామెంట్ చేయగా, అతడి వర్క్ ప్రెజర్ చూస్తే జాలి వేస్తోందని మరొకరు సానుభూతి తెలిపారు. దేశంలో సరైన కార్మిక చట్టాలు లేకపోవడమే దీనికి కారణమని కొందరు విమర్శించారు. మనం పన్నులు కడుతున్నా ట్రాఫిక్ సమస్యలు తీరడం లేదని, ప్రభుత్వాల పనితీరు వల్లే ఇలాంటి దుస్థితి దాపురించిందని మరికొందరు అసహనం వ్యక్తం చేశారు.
మరో వాదన..
అయితే, ఈ ఘటనపై మరో కోణం కూడా వినిపిస్తోంది. వ్యాపారంలో కస్టమర్ కంటే ఏదీ ముఖ్యం కాదని, ఒకవేళ సరైన సమయానికి పని పూర్తి కాక కస్టమర్ డీల్ రద్దు చేసుకుంటే ఆ ప్రభావం సంస్థపై పడి, చాలామంది ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంటుందని కొందరు కార్పొరేట్ సంస్థల కోణంలో కామెంట్ చేయడం గమనార్హం. జడ్జిమెంట్లు పాస్ చేయడం ఆపాలని వారు సూచిస్తున్నారు.






