జన నాయగన్ ముందు పెద్ద టార్గెట్.. ఆ సినిమా రికార్డును బీట్ చేయగలడా?

by Pulgam srinivas |

'లియో' ఓపెనింగ్స్‌ రూ.146.15 కోట్ల రికార్డును 'జన నాయగన్' అధిగమిస్తుందా? లేదా? అనేది ఆసక్తిగా మారింది.

జన నాయగన్ ముందు పెద్ద టార్గెట్.. ఆ సినిమా రికార్డును బీట్ చేయగలడా?
X

దిశ, వెబ్ డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ప్రేక్షకుల ముందుకు రానున్న తొలి చిత్రం 'జన నాయగన్'. ఈ సినిమాను రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభం కాగా, ముఖ్యంగా తమిళనాడులో అద్భుతమైన స్పందన లభిస్తోంది. దీంతో ఈ చిత్రం తొలి రోజు ఎంత మేర వసూళ్లు సాధిస్తుందనే ఆసక్తి అభిమానులతో పాటు సినీ వర్గాల్లోనూ నెలకొంది. ఇలాంటి సమయంలో విజయ్ కెరీర్‌లోని తొలి రోజు కలెక్షన్ల రికార్డుపై చర్చ మొదలైంది. గతంలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'లియో' చిత్రం తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.146.15 కోట్ల గ్రాస్ వసూలు చేసి విజయ్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.

అనంతరం వచ్చిన 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (GOAT) మాత్రం తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.104.75 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసి 'లియో' రికార్డుకు చేరువ కాలేకపోయింది. ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత విజయ్ నుంచి వస్తున్న తొలి సినిమా కావడంతో 'జన నాయగన్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ చిత్రం 'లియో' తొలి రోజు వసూళ్ల రికార్డును అధిగమించి విజయ్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలుస్తుందా? లేదా? అనే ఉత్కంఠ అభిమానుల్లో కనిపిస్తోంది. దీనికి సమాధానం తెలుసుకోవాలంటే సినిమా విడుదలై తొలి రోజు కలెక్షన్లు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Next Story