- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాహుల్ గాంధీ అరెస్టు మోడీ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనం
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ ఖమ్మం రూరల్ మండలంలోని ఏదులాపురం మున్సిపాలిటీ నాయుడుపేట బైపాస్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

దిశ, ఖమ్మం రూరల్ : కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ ఖమ్మం రూరల్ మండలంలోని ఏదులాపురం మున్సిపాలిటీ నాయుడుపేట బైపాస్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి, ఏదులాపురం మున్సిపాలిటీ చైర్‌పర్సన్ పి. అనిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుంబూరు దయాకర్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్య విలువలను కాలరాసే చర్య అని విమర్శించారు. ప్రజల తరఫున ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకుడిని అరెస్టు చేయడం ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని ఆరోపించారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని అణచివేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. నీట్ పేపర్ లీకేజీ కారణంగా అనేక మంది విద్యార్థులు నష్టపోయారని పేర్కొంటూ, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసు బలప్రయోగం చేయడం సరికాదని అన్నారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏదులాపురం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ తమ్మినేని, ఖమ్మం రూరల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తోట వీరభద్రం, ఏదులాపురం టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు బానోత్ కిషోర్, కాంగ్రెస్ నాయకులు బండి జగదీష్, మద్ది మల్లారెడ్డి, రవి, వీరారెడ్డి, పంతులు, కొప్పుల చంద్రశేఖర్, వీరెల్లి అప్పారావు, వర్గాని శ్రీను, సర్పంచులు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






