రోడ్డంతా గుంతలే.. ప్రయాణమంతా భయమే

by Taduka Kalyani |

రాయపోల్ మండల కేంద్రం నుంచి కొత్తపల్లి మీదుగా రాంసాగర్ వరకు ఉన్న బీటీ రహదారి గుంతలమయంగా మారింది.

రోడ్డంతా గుంతలే.. ప్రయాణమంతా భయమే
X

దిశ,రాయపోల్: రాయపోల్ మండల కేంద్రం నుంచి కొత్తపల్లి మీదుగా రాంసాగర్ వరకు ఉన్న బీటీ రహదారి గుంతలమయంగా మారింది. వర్షాకాలం కావడంతో గుంతల్లో నీరు నిలిచి వాటి లోతు తెలియక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల భయంతో ప్రయాణిస్తున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story