- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అష్నీర్ గ్రోవర్ బయోపిక్ నుంచి తప్పుకున్న ఆమిర్ ఖాన్.. కారణం అదేనా?
ఈ సినిమా నుంచి ఆమిర్ ఖార్ తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దర్శకుడు రాహుల్‌తో విభేదాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ నిర్మాతగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా తన మల్టీ టాలెంట్‌తో బాక్సాఫీసు వద్ద సత్తా చాటుతున్నారు. ఆమిర్ ఖాన్ పారిశ్రామిక వేత్త అష్నీర్ గ్రోవర్ జీవిత కథ ఆధారంగా రాబోతున్న బయోపిక్‌లో నటిస్తున్నట్లు గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇందులో అష్నీర్ ప్రయాణాన్ని పాపులర్ రియాలిటీ టీవీ షో షార్క్ ట్యాంక్ ఇండియా మొదటి సీజన్ న్యాయనిర్ణేతగా వచ్చిన గుర్తింపును చూపించబోతున్నారట. దర్శకుడు రాహుల్ మోదీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుండగా.. ఈ నేపథ్యంలో.. తాజాగా, బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ సినిమా నుంచి ఆమిర్ ఖార్ తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దర్శకుడు రాహుల్‌తో విభేదాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. కథ విషయంలో మనస్పర్థలు రావడంతో ఆమిర్ ఖాన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారట. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక ఆయన వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. ఇటీవల గౌరీని మూడో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లి లవ్ జీహాద్ విమర్శలు రాగా ఆమిర్ తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.






