- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నడ్డానే జంతర్ మంతర్‍కు వచ్చి చర్చించాలి..రెండో విడత చర్చల ఆహ్వానంపై సీజేపీ రియాక్ట్
సీజేపీతో రెండో విడత చర్చలకు జేపీ నడ్డా ఆహ్వానించడంపై సీజేపీ పార్టీ స్పందించింది. ప్రభుత్వం తమతో చర్చించాలంటే ప్రజల్లోకి రావాల్సిందేనని స్పష్టం చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్రంతో చర్చలకు మేము సిద్ధమేనని సీజేపీ పార్టీ మరోసారి స్పష్టం చేసింది. అయితే చర్చల కోసం తాము ఎవరి ఇంటికి వెళ్లబోమని తెలిపింది. ఈ మేరకు ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ మీడియాతో మాట్లాడుతూ.. రెండో విడత చర్చల కోసం ఇవాళ ఉదయం పోలీసులు మళ్లీ మమ్మల్ని సంప్రదించారని చెప్పారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా మీతో మాట్లాడాలనుకుంటున్నారని చెప్పి ఆయన నివాసానికి రమ్మని ఆహ్వానించినట్లు తెలిపారు. కానీ ఈ ఆహ్వానాన్ని తాము స్పష్టంగా తిరస్కరించినట్లు సౌరవ్ దాస్ వెల్లడించారు. మేము ఎవరి ఇంటికి, ఆఫీస్‌కు వెళ్లేదే లేదని.. కేంద్ర మంత్రులు, ప్రభుత్వం మాతో చర్చలు జరపాలంటే ఇకపై జంతర్ మంతర్ వద్దకు రావాల్సిందేనని స్పష్టం చేశారు. ఇక్కడ జనతా దర్బార్ జరుగుతోందని ప్రజల ముందుకు వచ్చి చర్చలు జరపాలన్నారు.
తటస్థ వేదిక అయినా వస్తాం:
ఈ సందర్భంగా మాట్లాడిన సౌరవ్ దాస్ తాము చదువుకున్న వ్యక్తులమేనని తాము పట్టుదలకు పోయే వ్యక్తులం కాదని పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు చర్చల కోసం జంతర్ మంతర్ వద్దకు వస్తే తమ భద్రతపై ఏదైనా ఆందోళన ఉంటే జంతర్ మంతర్ సమీపంలోని ఏదైనా తటస్థ (న్యూట్రల్) వేదికగా సమావేశమయ్యేందుకు మేము సిద్ధమేనన్నారు. ఈ విషయంలో కేంద్రం సమాధానం కోసం వేచి చూస్తున్నామని వెల్లడించారు. అలాగే మా డిమాండ్లను ఆమోదించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉండాలని అర్థం లేని చర్చల కోసం మమ్మల్ని పిలవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు. మా సమయం చాలా విలువైనది. వేలాది మంది ప్రజలు ఇప్పటికీ ఈ నిరసనలో పాల్గొంటున్నారు, వారిని సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత కూడా మాపై ఉందని తెలిపారు. .ప్రభుత్వం నిజంగా మాతో చర్చలు జరిపే ఉద్దేశంతో ఉందో లేదో ముందుగా స్పష్టం చేయాలని సౌరవ్ దాస్ డిమాండ్ చేశారు.






