సోనమ్ వాంగ్‌చుక్‌ దీక్ష విరమించాలని సీజేపీ లేఖ

by Malleboina Mahesh |   (  Updated:2026-07-22 09:28:44  IST  )

సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ దీక్ష విరమించాలని సీజేపీ లేఖ; ఆయన త్యాగం స్ఫూర్తిదాయకమని, పోరాటాన్ని తాము కొనసాగిస్తామని ప్రకటన.

సోనమ్ వాంగ్‌చుక్‌ దీక్ష విరమించాలని సీజేపీ లేఖ
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలో సీజేపీ తలపెట్టిన దీక్షలో పాల్గోని ఆమరణ నిరాహార దీక్షకు పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) దిగిన విషయం తెలిసింతే అయితే ఆయనను పోలీసులు ఆస్పత్రికి తరలించినప్పటకి దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఆమరణ నిరాహార దీక్ష(Hunger strike) పై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) స్పందించింది. తక్షణమే నిరాహార దీక్షను విరమించాలని విజ్ఞప్తి చేస్తూ సీజేపీ ఆయనకు ఒక ప్రత్యేక లేఖను రాసింది. విద్యార్థుల కోసం, దేశ భవిష్యత్తు కోసం ఆయన చేస్తున్న త్యాగం కోట్ల మంది విద్యార్థులకు, యువతకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని సీజేపీ లేఖలో పేర్కొంది.

ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, ముందుగా ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని పార్టీ ప్రతినిధులు కోరారు. "మీరు దీక్ష విరమించినంత మాత్రాన ఈ పోరాటం ఆగిపోదు. విద్యార్థుల హక్కుల కోసం, న్యాయం కోసం మేం ఈ ఉద్యమాన్ని చివరి వరకు కొనసాగిస్తాం" అని సీజేపీ స్పష్టమైన వాగ్దానం చేసింది. వాంగ్‌చుక్ ప్రాణాలు దేశానికి ఎంతో విలువైనవని, ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని దీక్షను విరమించాలని సీజేపీ కోరింది.

CJP ఆందోళనపై పోలీసుల చర్యల కేసు.. అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ

Next Story