- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజాస్వామ్యాన్ని అణచివేసే ప్రయత్నాలను కాంగ్రెస్ ఎప్పటికీ సహించదు: ఎమ్మెల్యే
రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ గోదావరిఖనిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా చేశారు.

దిశ, గోదావరిఖని: ప్రజాస్వామ్యాన్ని అణచివేసే ప్రయత్నాలను కాంగ్రెస్ ఎప్పటికీ సహించదని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం గోదావరిఖని రాజీవ్ రహదారిపై రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ కాంగ్రెస్ నాయకులు ధర్నా చేసి మాట్లాడారు. ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నిరుద్యోగ యువతపై దాడి చేయడాన్ని నిరసిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసం ఎదుట చేపట్టిన ఆందోళనలో లోక్‌సభ, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కల్పించిందని, ప్రజల తరఫున ప్రశ్నించే ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విలువలను అవమానపరచడమేనని అన్నారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం..
ప్రతిపక్షం ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం, విమర్శిస్తే కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించడం బీజేపీ ప్రభుత్వంలో నిత్యకృత్యంగా మారిందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలను గౌరవించాల్సిన కేంద్ర ప్రభుత్వం నిరంకుశ ధోరణితో వ్యవహరించడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ప్రజల హక్కులను పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరుగుతున్న ఈ పోరాటంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోమని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్, మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాత పల్లి ఎల్లయ్య యాదవ్, కార్పొరేటర్లు నేల కంటి రాము, ధూళికట్ట సతీష్, బొంతల రాజేష్, కాల్వ లింగస్వామి, తిప్పారపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






