అది నాకు దక్కిన పెద్ద గౌరవంగా భావిస్తున్నా.. ఆ పాత్ర నా జీవితాన్ని మార్చేసింది: అవికా గోర్

by Mallepaka Hamsa |

నేను ఆనంది పాత్రతో పాటే పెరిగాను. ఈ సీరియల్ నాకు కేవలం ఒక గుర్తింపు ఇవ్వడమే కాకుండా, ఒక మనిషిగా నన్ను ఎంతో మార్చింది.

అది నాకు దక్కిన పెద్ద గౌరవంగా భావిస్తున్నా.. ఆ పాత్ర నా జీవితాన్ని మార్చేసింది: అవికా గోర్
X

దిశ, సినిమా: బుల్లితెరపై సంచలనం సృష్టించిన ‘చిన్నారి పెళ్లికూతురు’ ద్వారా పరిచయంపై ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నారు అవికా గోర్. ఆ తర్వాత సినిమాలపై ఆసక్తితో హీరోయిన్‌గా ఇండస్ట్రీకి వచ్చారు. తెలుగు, హిందీ భాషల్లో పలు సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించిన ఈ భామ కెరీర్ పీక్స్‌లో ఉండగానే తన ప్రియుడి మిలింద్‌ను పెళ్లి చేసుకున్నారు. ఇక ఇటీవల సైకలాజికలం రొమాంటిక్ థ్రిల్లర్ ‘అగ్లీ స్టోరీ’తో సరికొత్త అనుభూతిని అందించారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్ ప్రారంభమై 18 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, నటి అవికా గోర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. "నేను ఆనంది పాత్రతో పాటే పెరిగాను. ఈ సీరియల్ నాకు కేవలం ఒక గుర్తింపు ఇవ్వడమే కాకుండా, ఒక మనిషిగా నన్ను ఎంతో మార్చింది.

ఒక మంచి కథ సమాజంలో ఎంత గొప్ప మార్పు తీసుకురాగలదో నాకు ఆ రోజే అర్థమైంది. ఇప్పటికీ జనాలు నన్ను ఆనంది అని గుర్తుపెట్టుకుని అంతగా ప్రేమిస్తున్నారంటే, అది అవికాగా నాకు దక్కిన పెద్ద గౌరవం. ఆనంది పాత్ర నా జీవితాన్నే మార్చేసింది" అని చెప్పారు. షూటింగ్ స్పాటే తనకు నటన నేర్పిన మొదటి పాఠశాల అని అవికా చెప్పారు. కెమెరా ముందు ఎలా నటించాలి, భావాలు ఎలా చూపించాలి అనేది అక్కడే రోజూ సీనియర్ నటులను చూస్తూ నేర్చుకున్నానని తెలిపారు. అక్కడ నేర్చుకున్న క్రమశిక్షణ, ఓపికే ఈరోజు నటిగా తన ఎదుగుదలకు కారణమని అన్నారు. చిన్నతనంలోనే పెళ్లిళ్లు చేసే పద్ధతిని ప్రశ్నిస్తూ, ఆడపిల్లల చదువు, వారి హక్కుల గురించి ఈ సీరియల్ బాగా చెప్పిందని అవికా గుర్తుచేశారు.

Next Story