- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అందుకే రామ్ చరణ్‌తో సినిమా చేయలేదు.. షాకింగ్ నిజాలు చెప్పిన మేర్లపాక గాంధీ
రామ్ చరణ్‌కు చెప్పిన కథపై తనకే సంతృప్తి లేకపోవడంతో ముందుకెళ్లలేదని మేర్లపాక గాంధీ చెప్పారు.

దిశ, వెబ్ డెస్క్: టాలెంటెడ్ దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించిన తాజా చిత్రం 'కొరియన్ కనకరాజు'. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, రితిక నాయక్ కథానాయికగా నటించిన ఈ సినిమా ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్‌తో సినిమా ఎందుకు చేయలేకపోయారనే విషయంపై మేర్లపాక గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. 'ఎక్స్‌ప్రెస్ రాజా' సినిమా తర్వాత యువీ క్రియేషన్స్ బ్యానర్‌లో రామ్ చరణ్‌తో సినిమా చేసే అవకాశం వచ్చింది. ఆ సందర్భంగా ఒక కథను సిద్ధం చేసి రామ్ చరణ్‌కు వినిపించాను.
అయితే కథ లైన్ బాగానే ఉన్నప్పటికీ, పూర్తి స్థాయిలో తనకు సంతృప్తి కలగలేదు. నాకే ఆ కథపై పూర్తి నమ్మకం లేకపోతే ముందుకు వెళ్లడం సరి కాదని అనిపించింది. అదే విషయాన్ని రామ్ చరణ్ గారికి, యువీ క్రియేషన్స్ వారికి చెప్పాను. వారు కూడా 'నీకు పూర్తిగా నమ్మకం వచ్చినప్పుడు చేద్దాం' అని చాలా సానుకూలంగా స్పందించారని మేర్లపాక గాంధీ వెల్లడించారు. ఆ తర్వాత తాను 'కృష్ణార్జున యుద్ధం' కథను సిద్ధం చేసి హీరో నానికి వినిపించానని, ఆ కథ ఆయనకు బాగా నచ్చిందని తెలిపారు. ఆ సినిమా మంచి విజయం సాధిస్తుందని ఇద్దరూ భావించినప్పటికీ, ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ పొందలేదని మేర్లపాక గాంధీ పేర్కొన్నారు.






