హనుమకొండకు చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

by Jakkula.Mamatha |   (  Updated:2026-07-22 06:35:05  IST  )

ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హనుమకొండకు చేరుకున్నారు.

హనుమకొండకు చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
X

దిశ, హనుమకొండ కలెక్టరేట్: ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హనుమకొండకు చేరుకున్నారు. అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి ఎన్ఐటీకి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఎమ్మెల్సీ సారయ్య, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, కె ఆర్ నాగరాజు, పోలీస్ కమిషన్ ఎన్.శ్వేత, కలెక్టర్లు చాహత్ బాజ్ పాయి, డాక్టర్ సత్య శారద, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డిలు స్వాగతం పలికారు. అనంతరం భట్టి విక్రమార్క పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

Next Story