- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యాప్ ఆధారిత ఆటో డ్రైవర్ల ఆగ్రహం.. నేడు ఓలా, ఊబర్ యాప్‌ల బంద్!
ఓలా, ఊబర్ వంటి యాప్ ఆధారిత క్యాబ్, ఆటో సేవలు తమకు గిట్టుబాటు కావడం లేదని, కిలోమీటర్‌కు సరైన ఛార్జీలు నిర్ణయించి డ్రైవర్లకు న్యాయమైన కమిషన్ అందించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యాప్ ఆధారిత డ్రైవర్ ఫోరం(TADF) ఆధ్వర్యంలో బుధవారం ఒక రోజు యాప్ బంద్‌కు పిలుపునిచ్చారు.

దిశ,మేడిపల్లి: ఓలా, ఊబర్ వంటి యాప్ ఆధారిత క్యాబ్, ఆటో సేవలు తమకు గిట్టుబాటు కావడం లేదని, కిలోమీటర్‌కు సరైన ఛార్జీలు నిర్ణయించి డ్రైవర్లకు న్యాయమైన కమిషన్ అందించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యాప్ ఆధారిత డ్రైవర్ ఫోరం(TADF) ఆధ్వర్యంలో బుధవారం ఒక రోజు యాప్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్లు నిరసన చేపట్టారు.యాప్ బంద్‌కు సహకరించాలని కోరుతూ, ఓలా–ఊబర్ యాప్‌ల ద్వారా ప్రయాణికులను తీసుకెళ్తున్న ఆటోలను కార్యకర్తలు అడ్డుకున్నారు. యాప్ బంద్ విజయవంతం కావాలంటే అందరూ సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా డ్రైవర్లు మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా పెరుగుతున్న డీజిల్, పెట్రోల్, సీఎన్‌జీ ధరలు, వాహనాల నిర్వహణ ఖర్చులు, విడిభాగాల ధరలు భారీగా పెరిగిన, ఓలా, ఊబర్ సంస్థలు చెల్లిస్తున్న చార్జీల్లో ఎలాంటి పెంపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వస్తున్న ఆదాయంతో కుటుంబాన్ని పోషించడం కూడా కష్టంగా మారిందని తెలిపారు. కిలోమీటర్‌కు ప్రస్తుతం లభిస్తున్న చార్జీలు సరిపోవడం లేదని, కనీసం రూ.18 నుంచి రూ.20 వరకు చెల్లించేలా కొత్త రేట్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పలుమార్లు సంస్థల దృష్టికి సమస్యలను తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతోనే ఒక రోజు యాప్ బంద్‌కు పిలుపునిచ్చినట్లు వెల్లడించారు. డ్రైవర్లకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, ప్రభుత్వం కూడా ఈ సమస్య పై జోక్యం చేసుకుని యాప్ ఆధారిత డ్రైవర్లకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ ధర్నాలో పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.






