- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయవాడలో ఉద్రిక్తత... బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల ఘర్షణ
by Vemula.Srinu Prasad |
విజయవాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని విజయటాకీస్ నుంచి కాంగ్రెస్ కార్యాలయం వరకు నిరసన వ్యక్తం చేశారు. ..

X
దిశ, వెబ్ డెస్క్: విజయవాడ(Vijayawada)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్(Bjp State Chief Madhav) ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని విజయటాకీస్ నుంచి కాంగ్రెస్ కార్యాలయం(Congress Office) వరకు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ఇరువర్గాలకు చెందిన కార్యకర్తలకు గాయాలయ్యాయి. దీంతో రెండు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. అయితే బీజేపీ శ్రేణుల తీరును కాంగ్రెస్ కార్యకర్తలు తప్పుబట్టారు. శాంతియుతంగా నిరసనలు తెలపాలి కానీ తమ పార్టీ కార్యాలయంపై దాడి చేయడమేంటని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము బీజేపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
Next Story






