హీరోయిన్ మాటలకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ఎస్‌కేఎన్

by Pulgam srinivas |

ఎస్‌కేఎన్, శ్రీ గౌరీ ప్రియ మధ్య జరిగిన సరదా సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

హీరోయిన్ మాటలకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ఎస్‌కేఎన్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్‌లో ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న నిర్మాతల్లో ఎస్‌కేఎన్ ఒకరు. తాజాగా ఆయన సాయి రాజేష్‌తో కలిసి 'చెన్నై లవ్ స్టోరీ' చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం హీరోగా నటించగా, శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రం జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా చిత్రబృందం అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఓ అభిమాని శ్రీ గౌరీ ప్రియను, "మీకు బాగా నచ్చిన మూడు లవ్ స్టోరీ సినిమాలు ఏవి?" అని ప్రశ్నించాడు. అందుకు ఆమె 'సఖి', 'సూర్య సన్ ఆఫ్ కృష్ణన్', '96' చిత్రాల పేర్లు చెప్పింది.

వెంటనే పక్కనే ఉన్న ఎస్‌కేఎన్ సరదాగా స్పందిస్తూ, "మూడు డబ్బింగ్ సినిమాల పేర్లు కాదు... మూడు తెలుగు లవ్ స్టోరీ సినిమాల పేర్లు చెప్పండి" అన్నారు. అంతటితో ఆగకుండా, పక్క భాషల హీరోయిన్లు వాళ్ల సినిమాల పేర్లు చెప్పి, మన వాళ్లు కూడా ఇతర భాష సినిమాల పేర్లే చెబితే మన తెలుగు సినిమాలు ఎప్పుడు ఎదుగుతాయి? అంటూ చిరునవ్వుతో వ్యాఖ్యానించారు. అనంతరం "సరే... ఇప్పుడు మూడు తెలుగు సినిమాల పేర్లు చెప్పండి" అని చెప్పడంతో అక్కడున్న వారంతా నవ్వుల్లో మునిగిపోయారు. ఎస్‌కేఎన్ చేసిన ఈ సరదా వ్యాఖ్యలు, శ్రీ గౌరీ ప్రియ స్పందన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరి మధ్య జరిగిన ఈ ఆసక్తికర సంభాషణపై నెటిజన్లు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

Next Story