- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిప్యూటీ జనరల్ మేనేజర్ ముత్యం వెంకటరమణ నివాసంలో ఏసీబీ సోదాలు
పునరుత్పాదక ఇంధన సంరక్షణ సౌరశక్తి(టీజీఆర్‌ఈడీసీఓ) డిప్యూటీ జనరల్ మేనేజర్(టెక్నికల్) ముత్యం వెంకటరమణ నివాసాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు.

దిశ,శేరిలింగంపల్లి: పునరుత్పాదక ఇంధన సంరక్షణ సౌరశక్తి(టీజీఆర్‌ఈడీసీఓ) డిప్యూటీ జనరల్ మేనేజర్(టెక్నికల్) ముత్యం వెంకటరమణ నివాసాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ముత్యం వెంకటరమణ నివాసంతో పాటు పది ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. మాధాపూర్‌లోని ఆయన నివాసంతో పాటు కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ పర్యవేక్షణలో సోదాలు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడుతూ కమిషన్ల పేరిట కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్లుగా ఆయన పై ఆరోపణలు ఉన్నాయి. పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన పునరుత్పాదక ఇంధన ఇంధన సంరక్షణ సౌరశక్తి, ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ వంటి కార్యక్రమాల అమలుకు నోడల్ ఏజెన్సీ గా పనిచేస్తున్నారు. ఈ దాడుల్లో అవినీతి సొమ్ము లెక్క ఎంత తేలుతుందో చూడాలి.






