- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండియాకు వచ్చిన కోహ్లీ, అనుష్కలపై దారుణంగా ట్రోల్స్!
ఇండియాకు వచ్చిన కోహ్లీ, అనుష్కలపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, హీరోయిన్ అనుష్క శర్మ దంపతులు ఇండియాకు చేరుకున్నారు. మొన్నటి వరకు లండన్ లోనే ఉన్న ఈ జంట.. యూపీ బృందావనంలోని ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించింది. ఇటీవలే ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ ముగిసిన నేపథ్యంలో విరాట్ కోహ్లీకి బ్రేక్ దొరికింది. ఈ క్రమంలోనే మళ్లీ ఇండియా పర్యటనకు వచ్చాడు. తనకు దొరికిన కొంత సమయాన్ని ఆధ్యాత్మిక మార్గంలో గడపడం కోసం ఆశ్రమానికి వెళ్ళాడు. ఇక ఈ ఆశ్రమానికి విరాట్ కోహ్లీ దంపతులు వెళ్లిన వీడియో వైరల్ గా మారింది.
దీంతో సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రతిపక్ష పార్టీలు నిరసనలకు దిగిన నేపథ్యంలో.. విరాట్ కోహ్లీ స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ అట్టుడుకుతున్న నేపథ్యంలో... నీకు ఆధ్యాత్మికత కావాలా? అంటూ నిలదీస్తున్నారు. విరాట్ కోహ్లీ ఒక్కడే కాదు మిగిలిన టీమిండియా సభ్యులు కూడా సీజేపీ నిరసనలపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులపై చేసిన లాఠీచార్జీని ఖండిస్తూ పోస్టులు పెట్టాలని కోరుతున్నారు. లేకపోతే భారత క్రికెటర్లను ఇండియాలో తిరగనివ్వబోమని హెచ్చరిస్తున్నారు. క్లిక్






