- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ భూమి ఆక్రమణ యత్నం.. అడ్డుకున్న జీపీఓ
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఏదులాపురం రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 142లో ఉన్న ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించేందుకు యత్నించిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది.

దిశ, ఖమ్మం రూరల్ : ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఏదులాపురం రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 142లో ఉన్న ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించేందుకు యత్నించిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న ఖమ్మం రూరల్ జీపీఓ కోటేశ్వరరావు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ జరుగుతున్న పనులను నిలిపివేశారు. ప్రభుత్వ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా చేపడుతున్న పనులను వెంటనే నిలిపివేయాలని సంబంధిత వ్యక్తులను ఆదేశించారు.
ఈ సందర్భంగా జీపీఓ మాట్లాడుతూ, ప్రభుత్వ భూములను ఆక్రమించడం చట్టవిరుద్ధమని, అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. అనంతరం ఘటనపై సంబంధిత రెవెన్యూ అధికారులకు సమాచారం అందించి, భూమికి సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలించి నివేదిక సమర్పించాలని సూచించినట్లు తెలిసింది. ప్రభుత్వ భూములపై ఎలాంటి అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు జరగకుండా నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారగా, ప్రభుత్వ భూములను ఆక్రమించేందుకు యత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుని ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.






