బాలకృష్ణ కాలి కండరంలో రక్తం గడ్డ కట్టింది: హెల్త్ బులెటిన్ ఏఐజీ విడుదల

by Vemula.Srinu Prasad |

సినిమా షూటింగ్‌లో నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గాయపడిన విషయం తెలిసిందే. అయితే ఆయన హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు....

బాలకృష్ణ కాలి కండరంలో రక్తం గడ్డ కట్టింది: హెల్త్ బులెటిన్ ఏఐజీ విడుదల
X

ది, వెబ్ డెస్క్: సినిమా షూటింగ్‌లో నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Actor and Hindupur MLA Nandamuri Balakrishna) గాయపడిన విషయం తెలిసిందే. అయితే ఆయన హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రి(Hyderabad AIG Hospitals)లో చికిత్స పొందుతున్నారు.. కాలికి గాయం కావడంతో వైద్యులు ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. ఇందులో భాగంగా బాలకృష్ణ తాజా హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. బాలకృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉంది. కాలి కండరంలో రక్తం గడ్డకట్టింది. ఆర్దోపెడిక్ సర్జన్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలు పూర్తి తర్వాత చికిత్స ప్రారంభిస్తామని హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు.

కాగా బాలకృష్ణ నటిస్తున్న 111 చిత్రాన్ని దర్శకుడు మలినేని గోపీచంద్ తెరకెక్కిస్తున్నారు. కాకినాడ పోర్టులో యాక్షన్ సీన్‌ను రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిన్న మసిల్ టియర్ అయింది. దీంతో బాలకృష్ణ మోకాలికి గాయం అయింది. వెంటనే ఆయన్ను కాకినాడ ప్రైవేటు ఆస్పత్రిలో తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Next Story