విద్యార్థులకు విద్యా, భోజనం నాణ్యత విషయాలలో రాజీ పడొద్దు

by Batti.Sumithra |

వసతి గృహాలలో ఉంటూ విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు విద్యతో పాటు భోజన నాణ్యతలో ఎక్కడ రాజీ పడకుండా ఉండాలని ఆశ్రమ పాఠశాల హెచ్ఎంతో పాటు సిబ్బందికి ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సూచనలు చేశారు.

విద్యార్థులకు విద్యా, భోజనం నాణ్యత విషయాలలో రాజీ పడొద్దు
X

దిశ, అచ్చంపేట : వసతి గృహాలలో ఉంటూ విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు విద్యతో పాటు భోజన నాణ్యతలో ఎక్కడ రాజీ పడకుండా ఉండాలని ఆశ్రమ పాఠశాల హెచ్ఎంతో పాటు సిబ్బందికి ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సూచనలు చేశారు. బుధవారం అచ్చంపేట పట్టణంలోని ఎస్టీ బాలుర ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులతో పాటు మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఎమ్మెల్యే మెనూ ప్రకారం భోజనం అందుతుందా లేదా ? కడుపునిండా భోజనం చేస్తున్నారా ? కాస్మోటిక్స్ అందుతున్నాయా ? వసతులు ఎలా ఉన్నాయి ? విద్యాబోధన ఎలా జరుగుతుంది తదితర విషయాల పై విద్యార్థులతో ఆరా తీశారు. విద్యార్థులకు సరిపడా డార్మెంటరీ లేకపోవడం, మంచినీటి వసతి, కాంపౌండ్ అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు లాంటి సమస్యలు ఉన్నట్లు ఉపాధ్యాయులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. త్వరలోనే సంబంధిత మంత్రి పర్యటన సందర్భంగా వసతి గృహానికి కావలసిన కాంపౌండ్ వాల్ తో పాటు, 200 మంది విద్యార్థులు ఒకేసారి కూర్చొని భోజనం చేసేలా నూతన డార్మెంటరీని మంజూరు చేస్తామని అలాగే ఇతర సాగునీరు సౌకర్యాలను మెరుగుపరిచేలా చర్యలు చేపట్టేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేస్తానన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు, నాయకులు పాల్గొన్నారు.

Next Story