- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నందమూరి బాలకృష్ణ ఆరోగ్యంపై డాక్లర్ల కీలక ప్రకటన
ఆయనను పరీక్షించాక ఎడమ మోకాలి దగ్గర రక్తం గడ్డకట్టి, వాపు వచ్చిందని వెల్లడించారు.

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో రాబోతున్న ప్రతిష్టాత్మక ‘NBK111’ చిత్రం షూటింగ్ కాకినాడ పోర్ట్ ఏరియాలో జరుగుతుండగా, అనుకోకుండా జరిగిన ఒక ప్రమాదంలో బాలయ్య గాయపడ్డారు. ఈ షూటింగ్‌లో బాలయ్య మోకాలికి గాయమైందని, దానికి ఒక చిన్న సర్జరీ చేయించుకోవాల్సి ఉందని దర్శకుడు గోపీచంద్ మలినేని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన వెంటనే ఆయనకు స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం తదుపరి వైద్యం, సర్జరీ కోసం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న నందమూరి అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, బాలకృష్ణ ఆరోగ్యంపై ఏఐజీ ఆసుపత్రి డాక్టర్లు ఓ కీలక ప్రకటన విడుదల చేశారు.
ఆయనను పరీక్షించాక ఎడమ మోకాలి దగ్గర రక్తం గడ్డకట్టి, వాపు వచ్చిందని వెల్లడించారు. మోకాలి కండరం ఏమైనా చిరిగిందేమో అని అనుమానిస్తున్నట్లు.. ప్రస్తుతం ఆర్థోపెడిక్ డాక్టర్లు ఆయనను దగ్గరుండి చూసుకుంటున్నారని అన్నారు. అంతేకాకుండా రకరకాల మెడికల్ టెస్టులు కూడా చేస్తున్నారని తెలిపారు. బాలకృష్ణ పాత హెల్త్ రికార్డులను కూడా చూసి, ఆయనకు ఏ ఇబ్బంది లేకుండా సురక్షితమైన వైద్యం అందించడానికి వేర్వేరు విభాగాల డాక్టర్ల టీమ్ ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోందని అన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడిందని, నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. అన్ని పరీక్షలు పూర్తయ్యాక ఆపరేషన్ ఎప్పుడు చేయాలి, ఎలాంటి వైద్యం అందించాలనేది నిర్ణయిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ఈ వార్త తెలిసిన అభిమానులు బాలయ్య త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.






