ఓటరు జాబితా స్వచ్ఛతే ప్రజాస్వామ్యానికి బలం

by Ratna Kumari |

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 59, 60 డివిజన్లలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు ఎన్యుమరేషన్ ప్రక్రియను బీజేపీ కిసాన్ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి పార్టీ నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఓటరు జాబితా స్వచ్ఛతే ప్రజాస్వామ్యానికి బలం
X

దిశ, ఖమ్మం రూరల్ : ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 59, 60 డివిజన్లలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు ఎన్యుమరేషన్ ప్రక్రియను బీజేపీ కిసాన్ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి పార్టీ నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక బూత్ లెవల్ అధికారులతో (బీఎల్‌ఓలు) సమావేశమైన ఆయన, ఎన్యుమరేషన్ కార్యక్రమం పురోగతి, అమలు తీరు, ప్రజల సహకారంపై సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో బీఎల్‌ఓలు నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తుండటం, ప్రజలు కూడా సానుకూలంగా స్పందించడం అభినందనీయమని పేర్కొన్నారు.

స్వచ్ఛమైన ఓటరు జాబితా ప్రజాస్వామ్యానికి వెన్నెముక వంటిదని కొండపల్లి శ్రీధర్ రెడ్డి అన్నారు. అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో నమోదు కావడం, అనర్హుల పేర్లు తొలగించడం ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయతకు అత్యంత అవసరమని తెలిపారు. ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక ఎన్యుమరేషన్ కార్యక్రమానికి ప్రజలు పూర్తి సహకారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ఈ కీలక బాధ్యతను అంకితభావంతో నిర్వహిస్తున్న బీఎల్‌ఓలను బీజేపీ నాయకులతో కలిసి అభినందించారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, నిష్పాక్షికత, విశ్వసనీయతను కాపాడడంలో వారి పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎల్లారావు గౌడ్, అర్బన్ మండల అధ్యక్షుడు వాకధాని రామకృష్ణ, కందుల శ్రీకృష్ణ, వల్లాల రమేష్ యాదవ్, కిరణ్ కుమార్, గజ్జల శ్రీనివాస్, అంకర్ల వీరబాబు, కొమరాబత్తిన వెంకన్న, ములుగు చందు, బానోతు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Next Story