జగిత్యాలలో తప్పిన ప్రమాదం.. ద్విచక్ర వాహనంపై కూలిన భారీ వృక్షం

by Kodari Anjali |

భారీ వర్షాలకు ఎస్‌కేఎన్‌ఆర్ బాయ్స్ కాలేజ్ మూల మలుపు వద్ద ఓ భారీ వృక్షం అకస్మాత్తుగా విరిగి, రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర వాహనంపై కూలింది.

జగిత్యాలలో తప్పిన ప్రమాదం.. ద్విచక్ర వాహనంపై కూలిన భారీ వృక్షం
X

దిశ, జగిత్యాల టౌన్: పట్టణంలో బుధవారం కురిసిన భారీ వర్షాలకు ఎస్‌కేఎన్‌ఆర్ (SKNR) బాయ్స్ కాలేజ్ మూల మలుపు వద్ద ఓ భారీ వృక్షం అకస్మాత్తుగా విరిగి, రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర వాహనంపై కూలింది. ఈ ఘటనలో వాహనదారుడు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం తెలిసిన వెంటనే 22వ వార్డు కౌన్సిలర్ అరవ లక్ష్మి ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మున్సిపల్ అధికారులకు సమాచారమిచ్చి, సిబ్బందితో కలిసి కూలిన చెట్టును వెంటనే తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర సమయాల్లో అధికారులను సంప్రదించాలని కోరారు. ప్రజల భద్రతే తమ తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్ స్పెక్టర్ చందు, జవాన్ లక్ష్మీనారాయణ, ఎన్విరాన్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story