రాష్ట్రానికి మోడీ.. నలుగురు ఐఏఎస్‌లకు ప్రత్యేక బాధ్యతలు

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణమవుతున్న భోగాపురం ఎయిర్ పోర్టును ఆగస్టు 1న ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు.

రాష్ట్రానికి  మోడీ.. నలుగురు ఐఏఎస్‌లకు ప్రత్యేక బాధ్యతలు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం భోగాపురం ఎయిర్ పోర్టు(Bhogapuram Airport)ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎయిర్ పోర్టును ఆగస్టు 1న ప్రధాని మోడీ(Pm Modi) చేతుల మీదుగా ప్రారంభం కానుంది. దీంతో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ బాధ్యతలను నలుగురు ఐఏఎస్ అధికారులకు అప్పగించారు. పారిశుద్ధ్యంతో పాటు ఇతర ప్రజా అవసరాలను ఈ అధికారులే పర్యవేక్షించనున్నారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, విజయవాడ మున్సిపల్ కమిషనర్ హెచ్ ఎం ధ్యాన చంద్ర, గుంటూరు మున్సిపల్ కమిషనర్ మయూర్ అశోక్‌లకు బాధ్యతలు అప్పగించారు. వీరికి సహాయంగా వివిధ కార్పొరేషన్ల నుంచి 26 మంది న్యాన్ కేడర్ అధికారులను నియమించారు. వీరంతా విజయనగరం కలెక్టర్‌కి రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story