- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
థియేటర్‌కి పోదాం చలో.. చలో.. ఓటీటీకి జెన్ Z బ్రేక్!
స్నేహితులతో కలిసి సిపిమారే వెళ్లడం, ప్రేక్షకుల స్పందనను గమనించడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వంటివి యువతరం అనుభవాన్ని మరింత ప్రత్యేకం చేస్తున్నాయి.

దిశ, ఫీచర్స్ : ఓటీటీల హవా నడుస్తున్న కాలంలో సినిమా థియేటర్లకు ఎవరెళ్తారు అనుకుంటున్నారా? అయితే తప్పులో కాలేసినట్టే..! ఎందుకంటే.. జెన్ Z యువత ఇప్పుడు థియేటర్లకు రావడాన్ని ఎక్కువగా ఇష్టపడుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆ మధ్య ఓటీటీల ప్రభావం కొంత పడి ఉండవచ్చు కానీ.. అది తాత్కాలికమే అని తేలిపోయింది. థియేటర్లకు వెళ్లి.. సినిమాలు చూస్తున్నప్పుడు కలిగే ఆనందం, అనుభూతి ఓటీటీలవల్ల కలగదని నేటి యువత భావిస్తోంది. అందుకే థియేటర్లను మళ్లీ పాప్ కల్చర్ కేంద్రంగా మార్చుతోంది.
ముఖ్యగా 1990ల నుంచి 2010 మధ్య జన్మించిన యువతరం, తమ వయసులో మిలీనియల్స్ కంటే ఎక్కువగా థియేటర్లకు వెళ్తున్నారని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. పాండమిక్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీ కష్టాలు ఎదుర్కొంటున్న సమయంలో ఈ ట్రెండ్ థియేటర్లకు మళ్లీ కొత్త ఆశలు కల్పిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఈ మార్పునకు ప్రధాన కారణాలు బార్బీ, ఒపెన్‌హైమర్, స్పైడర్-మ్యాన్.. అక్రాస్ ది స్పైడర్-వర్స్ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు, సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఈవెంట్స్ అని అంటున్నారు. జెన్ Z యువత కేవలం సినిమాలు చూడటం మాత్రమే కాకుండా, థియేటర్‌కు వెళ్లి దానిని ఆస్వాదించడం, తమకు మధురానుభూతిని ఇచ్చే ఈవెంట్‌గా భావిస్తున్నది. స్నేహితులతో కలిసి వెళ్లడం, సరైన అవుట్‌ఫిట్ ఎంచుకోవడం, థియేటర్‌లో ప్రేక్షకుల స్పందనను గమనించడం, తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వంటివి ఈ అనుభవాన్ని మరింత ప్రత్యేకం చేస్తున్నాయి. అందుకే థియేటర్‌కు పోదాం.. సినిమా చూద్దాం చలో.. చలో.. అంటోంది యువతరం!






