ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి సంరక్షించాలి

by Ratna Kumari |

జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియం ప్రాంగణంలో మున్సిపల్ కార్యాలయం ఆధ్వర్యంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి సంరక్షించాలి
X

దిశ, కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియం ప్రాంగణంలో మున్సిపల్ కార్యాలయం ఆధ్వర్యంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, మొక్కలు మానవాళి మనుగడకు ప్రతీకలని అన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడాలంటే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కనీసం ఒక మొక్కనైనా నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.

మొక్కలను రక్షించడం ద్వారా భావితరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని పేర్కొన్నారు. పచ్చదనం పెంపొందించడంలో ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ కాసర్ల గోదావరి స్వామి, కమిషనర్ పర్వతాలు, డీఈ హన్మంత్ రావు, టీపీఓ వినీత్, ఏఈ వేణు, కౌన్సిలర్లు మహేష్, రామ్మోహన్, అన్వర్, భూపతి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story