ప్రమాదపు అంచుల్లో మంథని ప్రాంతీయ పశు వైద్య శాల

by Kodari Anjali |

పెద్దపల్లి జిల్లా మంథని ప్రాంతీయ పశు వైద్య శాల భవనం ప్రమాదపు అంచుకు చేరింది.

ప్రమాదపు అంచుల్లో మంథని ప్రాంతీయ పశు వైద్య శాల
X

దిశ, మంథని: పెద్దపల్లి జిల్లా మంథని ప్రాంతీయ పశు వైద్య శాల భవనం ప్రమాదపు అంచుకు చేరింది. దీంతో భవనం శిథిలా వస్థకు చేరడంతో స్లాబ్ హెచ్చులు ఊడి కింద పడుతున్నాయి. ఆఫీస్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళ ఉద్యోగులు హెచ్చులు ఊడి తల మీద పడుతుందోనని భయంతో బిక్కు బిక్కు మంటూ విదులు నిర్వహిస్తున్నారు. కొద్దీ రోజులుగా ఈ భవనం శిథిలా వస్థకు చేరడంతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. మరుగుదొడ్లు కూడా లేకపోవడంతో సిబ్బంది ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఎవరికైనా ప్రమాదం జరిగే దాక పట్టించుకోరా..? అని ఆఫీస్ వచ్చే ప్రజలు, ప్రజా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఉన్నతాధికారులు దృష్టి సారించి నూతన భవనాన్ని మంజూరు చేయాలని కోరుతున్నారు.

Next Story