విద్యార్థులపై లాఠీఛార్జ్‌కు నిరసనగా కూసుమంచిలో కాంగ్రెస్ ఆందోళన

by Ratna Kumari |

జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన శాంతియుత ఆందోళనపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది.

విద్యార్థులపై లాఠీఛార్జ్‌కు నిరసనగా కూసుమంచిలో కాంగ్రెస్ ఆందోళన
X

దిశ, కూసుమంచి : నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన శాంతియుత ఆందోళనపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. విద్యార్థులకు మద్దతుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే, ఇతర కాంగ్రెస్ ఎంపీలు నిరసన కార్యక్రమంలో పాల్గొనగా వారిని పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ కూసుమంచి మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై పార్లమెంట్‌లో చర్చ నిర్వహించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, అలాంటి నిరసనలను పోలీసు బలగాలతో అణచివేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు బోడా వీరునాయక్, కొండా కృష్ణవేణి, బానోత్ శ్రీనివాస్, వడ్త్యా వెంకటేష్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు మంకెన వాసు, ప్రధాన కార్యదర్శి ఎండీ హఫీజుద్దీన్, జిల్లా నాయకులు జొన్నలగడ్డ రవి, జూకూరి గోపాలరావు, గుండా దామోదర్ రెడ్డి, బొల్లంపల్లి సుధాకర్ రెడ్డి, చిలకబత్తిని రామారావు, మాదాసు ఉపేందర్, బారి భద్రం, గుండా భూపాల్ రెడ్డి, బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story