- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హత్యలకు అడ్డాగా తెలంగాణ.. యోగిని చూసి నేర్చుకోండి: రాజాసింగ్
తెలంగాణ హత్యలకు అడ్డాగా మారిందని, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ను చూసి నేేర్చుకోవాలని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. మీర్ పేట్‌లో రౌడీషీటర్ సూరి హత్య కేసులు సంచలనంగా మారిందన్నారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ హత్యలకు అడ్డాగా మారిందని, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ను చూసి నేేర్చుకోవాలని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. మీర్ పేట్‌లో రౌడీషీటర్ సూరి హత్య కేసులు సంచలనంగా మారిందన్నారు. అఫ్రోజ్ అనే రౌడీషీటర్ సూరి అనే రౌడీషీటర్ ను హత్య చేసి తన స్నేహితులకు ఇన్ స్టాలో వీడియో కాల్ చేసి మాట్లాడాడని అన్నారు. ప్రతివారం ఓల్డ్ సిటీలో ఒక హత్య జరుగుతుందని ఇప్పుడు న్యూ సిటీలోనూ హత్యలు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత వందల హత్యలు జరిగాయని అన్నారు.
అసలు క్రైమ్ కంట్రోల్ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద ఏదైనా యాక్షన్ ఉందా అని ప్రశ్నించారు. లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేయాలి అంటే ముందు రేవంత్ రెడ్డి తన వద్ద ఉన్న హోంశాఖను ఎవరైనా మంచి వ్యక్తి ఇవ్వాలని సూచించారు. హత్యలు చేసి పోలీసులకే సవాల్ విసిరే పరిస్థితి రాష్ట్రంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, వ్యాపారులు బయటకు రావాలి అంటేనే బయపడిపోతున్నారని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి యోగి ఆదిత్యానాథ్ ను కలసి లా అండ్ ఆర్డర్ ఎలా కంట్రోల్ చేస్తున్నారో తెలుసుకుని రావాలని సూచించారు.






